Salman Khurshid: తమ హయాంలోనే అభినందన్ ఎదిగాడట... కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై నెటిజన్ల తిట్లదండకం!

  • ఇండియాలో ఏనోట విన్నా అభినందన్ పేరే
  • 1983లో పుట్టాడని ఇందిరకు క్రెడిట్ ఇవ్వాలా
  • కేంద్ర మాజీ మంత్రిపై నెటిజన్ల ట్రోలింగ్
అభినందన్ వర్ధమాన్... ఇప్పుడు ఇండియాలో ఏనోట విన్నా అదే పేరు. ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకోని వారుండరు. ఇదే సమయంలో ఆయన ధైర్యాన్ని, చూపించిన తెగువను తమ ఖాతాలో వేసుకుని రాజకీయ ప్రయోజం పొందాలని చూస్తున్న రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

తాజాగా, ఆయన యూపీఏ ప్రభుత్వ హాయాంలోనే పైలట్ గా ఎదిగాడని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించగా, నెటిజన్లు తిట్లదండకం అందుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఖుర్షీద్ కు శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని ఒకరు, ఖుర్షీద్ వ్యాఖ్యలు మొత్తం సైన్యాన్ని అపహాస్యం చేసినట్టేనని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, అభినందన్ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలనూ నెటిజన్లు వదలడం లేదు.
Salman Khurshid
Abhinandan
Net
Trolls

More Telugu News