Chennai: చెన్నై బీచ్ లో మూడు మృతదేహాలు!

  • నిత్యమూ జన సమ్మర్దంతో నిండివుండే బీచ్
  • ఒకదాని తరువాత ఒకటిగా కొట్టుకొచ్చిన మృతదేహాలు
  • 8 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు
చెన్నైలో నిత్యమూ జనసమ్మర్ధంతో నిండివుండే మెరీనా బీచ్ లో ఒకదాని తరువాత ఒకటిగా మూడు మృతదేహాలు కొట్టుకురావడం పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక్కడి శ్రామికుల విగ్రహం సమీపానికి నిన్న ఉదయం 7.30 గంటల సమయంలో ఓ మృతదేహం కొట్టుకురాగా, ఆపై 11.15 గంటల సమయంలో ఒకటి, మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒకటి ఒడ్డుకు చేరాయి.

ఇలా 8 గంటల వ్యవధిలో మూడు మృతదేహాలు కనిపించడంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. వీరిలో ఒకరు జేఎన్‌ఎన్‌ కాలేజీలో చదువుతున్న కన్నన్‌ గా, మరొకరిని జయచంద్రన్‌ అనే యువకుడిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సముద్రతీరంలో గస్తీ చేయాల్సిన పోలీసులు కొంతకాలంగా విధుల్లోకి రాకపోవడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పర్యాటకులు విమర్శించారు.
Chennai
Merina Beach
Deadbodies
Travellers

More Telugu News