ఐటీ గ్రిడ్ ఉద్యోగుల అదృశ్యం కేసులో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్
- ప్రతివాదులుగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ
- రేపు 10.30కు నలుగురినీ ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు ఆదేశం
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం 10.30 గంటలకు నలుగురినీ తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఆ నలుగురికి తాము సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అయితే, కేసు డైరీలో బ్లాంక్ పేపర్లు ఉండటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని ఏ కుటుంబసభ్యులు పోలీసులపై ఫిర్యాదు చేయరని మండిపడింది.