కేసును ఏపీకి బదిలీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేసింది?: పయ్యావుల కేశవ్
- టీడీపీ సర్వీస్ ప్రొవైడర్లపై టీఆర్ఎస్ ను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులు చేయిస్తోంది
- కేసీఆర్ చేతిలో జగన్ పావులా మారారు
- జగన్, విజయసాయిలకు ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారు
చట్ట ప్రకారం ఈ కేసును ఏపీకి బదిలీ చేయాల్సి ఉందని... కానీ, తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంతరార్థం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ లు కలిసిపోయారని చెప్పడానికి ఇది ఒక రుజువు అని అన్నారు. కేసీఆర్ చేతిలో జగన్ పావులా మారిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్, విజయసాయిరెడ్డి కుట్రలకు ఏపీలోని ఐదు కోట్ల మంది బుద్ధి చెబుతారని అన్నారు.