Andhra Pradesh: మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత!

  • టీఆర్ఎస్ లో చేరుతున్న సండ్ర
  • మెచ్చా కూడా వెళతారని రాజకీయవర్గాల్లో చర్చలు
  • మీడియా ముందుకొచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే
తెలంగాణ టీడీపీ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య త్వరలో టీఆర్ఎస్ లో చేరుతానని ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు నిలిచారు. ఈ నేపథ్యంలో మెచ్చా కూడా టీడీపీని వీడి కారు ఎక్కుతారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.

పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా తాను టీడీపీని వీడబోనని అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ ఫిరాయిస్తానని తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 
Andhra Pradesh
Telugudesam
TRS
Telangana
mecha

More Telugu News