kangana ranaut: ఔను.. నేను ప్రేమలో ఉన్నా: కంగనా రనౌత్

  • నా జీవితంలో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు
  • 20 ఏళ్ల వయసులో రిలేషన్ షిప్స్ పట్ల విభిన్నమైన ఆలోచనలు ఉండేవి
  • ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన విషయాన్ని వెల్లడించింది. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశానని... ఇదే సమయంలో తన జీవితంలో ప్రేమ లేని రోజంటూ లేదని చెప్పింది. ఇప్పుడు తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని తెలిపింది. తనకు స్ఫూర్తిగా నిలిచే ఒక తోడు కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. 20 ఏళ్ల వయసులో రిలేషన్ షిప్స్ పట్ల తనకు విభిన్నమైన ఆలోచనలు ఉండేవని... ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం కంగనా 'మెంటల్ హై క్యా' చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
kangana ranaut
bollywood
love

More Telugu News