Andhra Pradesh: వైఎస్ జగన్ మత గ్రంథాలను అవమానిస్తున్నారు!: ఏపీ మంత్రి యనమల
- మోదీ మళ్లీ అధికారంలోకి రాడని జగన్ కు తెలుసు
- అందుకే ఢిల్లీలోనే ప్లేటు ఫిరాయించాడు
- ఎవరు అధికారంలోకి వస్తే వారికే మద్దతంటున్నాడు
ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాడన్న విషయం వైసీపీ అధినేత జగన్ కు తెలుసని ఏపీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అందుకే జగన్ ఢిల్లీలో ప్లేటు ఫిరాయించారని విమర్శించారు. ఢిల్లీలో గెలిచేవాళ్లకే జగన్ ఇప్పుడు గాలం వేస్తాడని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడారు.
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడమే ప్రధాన అజెండాగా జగన్ పెట్టుకున్నారని యనమల దుయ్యబట్టారు. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారంలోకి ఎవరు వస్తే వాళ్లకు మద్దతు తెలుపుతామని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మత గ్రంథాలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో బైబిల్ పట్టుకుని తిరిగినా ఓట్లు రాలేదని ఆయనకు అక్కసుగా ఉందన్నారు. అందుకే ఇప్పుడు స్వామీజీల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆంధ్రులపై దాడులు జరిగినా, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినా, వ్యాపారులపై దాడులు జరిగినా జగన్ ప్రశ్నించడని విమర్శించారు.