Jana Sena: పిచ్చోళ్లలాగా ప్రవర్తిస్తున్నారు... వారి మాటలు పట్టించుకోనక్కర్లేదు: రేణూదేశాయ్‌

  • ఏదో పార్టీలో చేరాల్సిన అవసరం నాకేంటి
  • నేను రైతు సమస్యలపై డాక్యుమెంటరీ చేస్తున్నా
  • సాక్షి టీవీ ప్రతినిధిగా మారడం అందులో భాగం
ఇటీవల రేణూదేశాయ్‌ కర్నూల్‌ జిల్లా మంత్రాలయంలో సాక్షి టీవీ యాంకర్‌గా వ్యవహరిస్తూ రైతు సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు అదే నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. దీంతో పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీనే రేణూదేశాయ్‌ని ఉసిగొల్పుతోందంటూ జనసేన కార్యకర్తలు ఆమెపై విరుచుకు పడ్డారు. దీంతో ఆమె దీటుగా సమాధానమిచ్చారు. తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారి మానసిక స్థితిపై తనకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

'ఇన్నాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇకపై అటువంటి వారిని ఉపేక్షించేది లేదు. నాకు ఏ పార్టీలో చేరే అవసరం లేదు' అన్నారామె. 'నేను రైతు సమస్యలపై ఓ డాక్యుమెంటరీ షూట్‌ చేస్తున్నాను. అందుకోసమే ఆ రోజు సాక్షి టీవీ అవతారం ఎత్తాను. అంతకు మించి ఏమీ లేదు. కానీ కొందరు మూర్ఖులు ఏదో ఊహించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిచ్చోళ్లులాగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ పరోక్షంగా జనసేన కార్యకర్తలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Jana Sena
renudesay
YSRCP

More Telugu News