Andhra Pradesh: ఆ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు?.. గుంటూరు టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు భేటీ!

  • ఈరోజు ఉదయం 11 గంటలకు నేతలతో సమావేశం
  • ఇద్దరు అభ్యర్థులను ఇప్పటికే ఓకే చేసిన సీఎం
  • గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ప్రత్తిపాడు, మంగళగిరి, తాటికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో నేడు సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నుంచి ఆలపాటి రాజాకు మరోసారి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత ఇప్పటికే నిర్ణయించారు. అలాగే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గల్లా జయదేవ్ ను మళ్లీ రంగంలోకి దించాలని బాబు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు టీడీపీ నేతలతో బాబు విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
Andhra Pradesh
Guntur District
Telugudesam
Chandrababu
tour
5 seats

More Telugu News