Andhra Pradesh: రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ జగన్: కేఏ పాల్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాలన్నీ ఒకటైపోయాయని క్రైస్తవ ప్రచారకుడు, ప్రజాశాంతి పేరిట పార్టీ పెట్టిన కేఏ పాల్ ఆరోపించారు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ లు కలిసిపోగా, ఇప్పుడు వాటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేరిపోయిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, వైఎస్ జగన్ కలిశారని, తాను ఓడిపోతున్నానని తెలుసుకున్న జగన్, రాహుల్‌ ను కలిసి తన భవిష్యత్తుపై చర్చించారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కల సాకారం కాబోదని, ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. నరేంద్ర మోదీ కూడా తిరిగి ప్రధాని కాబోరని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది ప్రజాశాంతి పార్టీయేనని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
KA Paul
Rahul Gandhi
Jagan

More Telugu News