Chandrababu: మోదీని కోడికత్తి పార్టీ ఎందుకు నిలదీయడం లేదు?: చంద్రబాబు

  • రైల్వే జోన్ విషయంలో మోదీ అన్యాయం చేశారు
  • ఆదాయం వచ్చే డివిజన్ ను ఒడిశాలో కలిపారు
  • అన్యాయం చేస్తున్న మోదీని వైసీపీ ఎందుకు నిలదీయడం లేదు
కోర్నూలు జిల్లా కోడుమూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, వైసీపీలపై నిప్పులు చెరిగారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏపీకి మోదీ అన్యాయం చేశారని చెప్పారు. వాల్తేరు డివిజన్ లేకుండానే రైల్వేజోన్ ప్రకటించారని విమర్శించారు. ఆదాయం వచ్చే డివిజన్ ను ఒడిశాలో కలిపారని అన్నారు. మోదీ బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని కోడికత్తి పార్టీ ఎందుకు నిలదీయడం లేదని వైసీపీపై మండిపడ్డారు.
Chandrababu
modi
Telugudesam
ysrcp
bjp

More Telugu News