Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోట్ల.. మూడు ప్రాజెక్టులను మంజూరు చేసిన సీఎం

  • కోడుమూరు సభలో టీడీపీలో చేరిన కోట్ల కుటుంబం
  • పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరిక
  • వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ కెనాల్ ప్రాజెక్టులను మంజూరు చేసిన సీఎం
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన భార్య, డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కసాగర లక్ష్మీరెడ్డిలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించిన సభలో వీరంతా టీడీపీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కోట్ల... ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వేదవతి, గుండ్రేవుల, ఎల్లెల్సీ బైపాస్ కెనాల్ ప్రాజెక్టులను ఇస్తే టీడీపీలో చేరుతానని సీఎంకు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మూడు ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది.
Chandrababu
kotla
Kurnool District
kodumuru
Telugudesam

More Telugu News