chalapathi rao: జేబులో పదిపైసలు కూడా ఉండేవి కాదు .. చచ్చిపోవాలనిపించింది: సీనియర్ నటుడు చలపతిరావు

షార్ట్స్‌లో చూడండి
నటుడిగా చలపతిరావు సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి చలపతిరావు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"నటుడిగా తొలినాళ్లలో ఆర్ధికంగా చాలాకష్టాలు పడ్డాను. ఎవరినైనా వేషం అడగడానికి వెళ్లాలంటే .. జేబులో పది పైసలు కూడా ఉండేవి కాదు. అందువలన బస్సు ఎక్కకుండా ఎంతదూరమైనా నడిచే వెళ్లేవాడిని. పిల్లలు ముగ్గురూ చిన్నవాళ్లు .. నేను పోతే వాళ్ల మానాన వాళ్లు బతుకుతారుగదా .. చచ్చిపోదామనుకున్నాను. చలపతిరావు పిల్లలు అడుక్కుతింటున్నారు .. కనేసి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడని అనుకోకూడదని ఆగిపోయాను. ఇక రెండవ పెళ్లి అనేది లేదు .. ఈ పిల్లలను పెంచి ఒకదారికి తీసుకురావడమే నా ధ్యేయం అనుకుని కష్టపడ్డాను" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
chalapathi rao

More Telugu News