Telangana: తెలంగాణలో విషాదం.. ఎగ్జామ్ సెంటర్ లోనే ప్రాణాలు విడిచిన ఇంటర్ విద్యార్థి!

  • తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఘటన
  • పరీక్ష రాస్తూ పడిపోయిన గోపీరాజ్
  • మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చిన వైద్యులు
తెలంగాణలో ఇంటర్ పరీక్షల సందర్భంగా దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద శ్రీ చైతన్య కళాశాలలో పరీక్షలు రాస్తున్న గోపీరాజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు పిల్లాడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గోపీరాజ్ మార్గమధ్యంలోనే చనిపోయాడని తెలిపారు.

గోపీరాజ్‌ ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. గోపీరాజు స్వస్థలం ఖమ్మం జిల్లా అని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి, సోదరుడు ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
Telangana
secundrabad
Police
dead
at exam centre
inter student

More Telugu News