Revanth Reddy: హరీశ్ పని అయిపోయింది...నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం కేసీఆర్‌కు అలవాటే!: రేవంత్‌రెడ్డి

  • టీఆర్‌ఎస్‌లో ఆయనది ముగిసిన అధ్యాయం
  • వచ్చేసారి సిద్ధిపేట టికెట్‌ కూడా రాదు
  • ఏ ఎన్నికలైనా రాహుల్‌ వెర్సస్‌ మోదీయే
నమ్మినవాళ్లను నట్టేట ముంచడం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వెన్నతో పెట్టిన విద్యని, ఇప్పటి వరకు ఎంతోమందితో ఆడుకున్న ఆయన తాజాగా హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓ కేసుకు సంబంధించి హాజరయ్యేందుకు ఈరోజు సిద్ధిపేట వచ్చిన రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌లో ఇక హరీశ్‌ది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. సిద్ధిపేట నుంచి పోటీ చేయడం కూడా బహుశా ఇదే ఆఖరిసారి కావచ్చని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ఆయనకు టికెట్టు కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే కేంద్రంతో పోరాడి ఏదో సాధించేస్తానని చెబుతున్న కేసీఆర్‌, ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన హామీలు సాధించారా? కాళేశ్వరానికి కనీసం జాతీయ హోదా తెచ్చారా? అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు రాహుల్‌, వెర్సస్‌ మోదీగానే సాగుతాయని తెలిపారు.
Revanth Reddy
Harish Rao
KCR
siddipeta

More Telugu News