allu arjun: బన్నీ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన కేథరిన్

  • త్వరలో సెట్స్ పైకి త్రివిక్రమ్ - బన్నీ
  • కథానాయికగా పూజా హెగ్డే
  •  హ్యాట్రిక్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తదుపరి సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరిలో కాంబినేషన్లో 'దువ్వాడ జగన్నాథం' వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కేథరిన్ కూడా గతంలో బన్నీతో కలిసి 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు' సినిమాల్లో నటించింది. ఇటు పూజా హెగ్డే కి .. అటు కేథరిన్ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాకి ఈ ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, త్రివిక్రమ్ - బన్నీలకు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
allu arjun
pooja hegde
catherine

More Telugu News