బిన్ లాడెన్ కుమారుడి పౌరసత్వాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా
- తన తండ్రిని చంపిన అమెరికాపై పగ తీర్చుకుంటానని హంజా హెచ్చరిక
- లాడెన్ కుమారుడి కోసం అమెరికా వేట
- పట్టించిన వారికి భారీ నజరానా
తన తండ్రిని చంపిన అమెరికా, దాని మిత్రదేశాలపై పగ తీర్చుకుంటామని హంజా బిన్ లాడెన్ గతంలో హెచ్చరికలు జారీ చేశాడు. అల్ ఖాయిదాలో హంజా లాడెన్ ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. 2017 జనవరిలో హంజాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఆస్తులను బ్లాక్ చేసింది.
సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ఆచూకీ చెప్పినా, కచ్చితమైన సమాచారంతో పట్టించినా ఏడు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించింది.