India: యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారు.. బీజేపీపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రచురించిన పాకిస్థాన్ మీడియా!

  • డాన్ వెబ్ సైట్ లో కథనం
  • భారత పత్రిక లింక్ ను జతచేసిన సంస్థ
  • యుద్ధం వస్తుందని ముందే చెప్పారన్న జనసేనాని
పాకిస్థాన్ తో యుద్ధం రాబోతోందని కొందరు బీజేపీ నేతలు తనతో చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా తెలుగు నుంచి జాతీయ మీడియాకు వెళ్లగా, తాజాగా పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ వెబ్ సైట్ పవన్ కల్యాణ్ మాటలను యథాతథంగా ప్రచురించింది. భారత్ కు చెందిన ఓ అంగ్ల పత్రిక కథనం లింక్ ను దీనికి జతచేసింది. ‘యుద్ధం వస్తుందని బీజేపీ నాయకులు నాకు రెండేళ్ల కిందటే చెప్పారు. దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
India
Pakistan
war
Pawan Kalyan
BJP
pak media
news
dawn news
website

More Telugu News