Andhra Pradesh: ‘నేను నిప్పు’ అని చంద్రబాబు చెప్పుకుంటారు.. అందుకు రెండు కారణాలు ఉన్నాయి!: విజయసాయిరెడ్డి

  • కోట్లాది తెలుగు ప్రజల కలలను బాబు కాల్చిబూడిద చేశారు
  • ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఏపీ సీఎం తనను తాను నిప్పు అని చెప్పుకుంటూ ఉంటారనీ, అందుకు రెండు కారణాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘ఒకటి.. చంద్రబాబు కోట్లాది మంది తెలుగు ప్రజల కలలు, ఆశలను తన సొంత ప్రయోజనాల కోసం బుగ్గిపాలు చేశారు. రెండు.. వ్యక్తిగత అవసరాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అదే మంట తనను అధికారం నుంచి తప్పించబోతోందని భయపడుతున్నారు’ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
fire
YSRCP
Vijay Sai Reddy

More Telugu News