Andhra Pradesh: ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి..నాలుగు స్థానాల్లో టీడీపీ, ఓ స్థానంలో వైసీపీ ఏకగ్రీవం!

  • నామినేషన్ల పరిశీలన పూర్తి ఎన్నిక ఏకగ్రీవం 
  • టీడీపీ తరఫున యనమల, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు 
  • వైసీపీ నుంచి ఎన్నికయిన జంగా కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా ఐదు నామినేషన్లను ఆమోదించామని చెప్పింది. అధికార టీడీపీ నుంచి మంత్రి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించింది. ఇక వైసీపీ నుంచి బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు పేర్కొంది.
Andhra Pradesh
mlc
elections
5 seats

More Telugu News