Telangana: ఎల్బీనగర్ లో నూతన ఫ్లైఓవర్ ప్రారంభం

  • నూతన ఫ్లైఓవర్ ని ప్రారంభించిన మంత్రులు
  • హైదరాబాద్ లోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తాం
  • దశలవారీగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో నూతన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  హోం శాఖ మంత్రి మహమూద్ ఆలి, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ, హైదరాబాద్ లోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తామని, దశలవారీగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్ అభివృద్ధిలో ముందుందని అన్నారు.
Telangana
Hyderabad
ln nagar
new
fly over

More Telugu News