Tollywood: ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈ నెల 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను విడుదల చేస్తాం!: రామ్ గోపాల్ వర్మ

  • ఎన్టీఆర్ జీవితం ఆధారంగా చిత్రీకరణ
  • సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు
  • ట్విట్టర్ లో సినిమా విడుదలపై స్పందించిన వర్మ
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలతో పాటు ట్రైలర్ ను విడుదల చేసిన వర్మ.. ప్రేక్షకులు, అభిమానుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ తేదీని వర్మ ప్రకటించేశారు. ఈ నెల 22న ఎన్టీఆర్ ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను విడుదల చేస్తున్నామని వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Tollywood
lakshmies ntr
ram gopal varma
release date
Twitter

More Telugu News