Himanshu Rao: గోల్డ్ మెడల్ కొట్టిన కేటీఆర్ కుమారుడు!

  • 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్ ను సేకరించిన హిమాన్షు
  • 'బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌' వ్యక్తిగత విభాగంలో టాప్ స్థానం
  • బంగారు పతకాన్ని బహూకరించిన హీరోయిన్ పరిణీతి చోప్రా
రీసైకిలబుల్ వేస్ట్ ను సేకరించడంలో మిగతా అందరికన్నా ముందు నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నిర్వహించిన 'బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌' పర్యావరణ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.

వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ ను హిమాన్షు సేకరించగా, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మొత్తం 34,137 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ ను సేకరించి పాఠశాలల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం ఢిల్లీలో జరిగిన 'బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌' కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా, విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ అనూప్‌ పెబ్బీ ప్రత్యేకంగా అభినందించారు.
Himanshu Rao
KTR
KCR
Recyclable Waste

More Telugu News