Narendra Modi: నేడు విశాఖకు మోదీ.. కొత్త వరాలు గుప్పిస్తారా?

  • నేడు విశాఖపట్టణంలో మోదీ బహిరంగ సభ
  • ప్రధాని రాకపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న టీడీపీ
  • నల్లజెండాలతో నిరసన తెలపనున్న విభజన హామీల సాధన సమితి
ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు ముందే రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. అయితే, నేడు విశాఖలో మోదీ మరిన్ని వరాలు ఏమైనా కురిపిస్తారా? లేక గుంటూరు సభలోలా ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోసి వెళ్లిపోతారా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మరోవైపు, విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీలో మోదీ ఎలా అడుగుపెడతారంటూ టీడీపీ విరుచుకుపడుతోంది. ‘మోదీ గో బ్యాక్’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు నిరాహారదీక్షకు దిగారు. అలాగే, మోదీకి దారి పొడవునా నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్టు సాధన సమితి తెలిపింది.
Narendra Modi
Andhra Pradesh
Visakhapatnam District
BJP
Telugudesam

More Telugu News