Andhra Pradesh: ఈ నలుగురు కలిసి చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారు: బుద్ధా వెంకన్న

  • మోదీ, కేసీఆర్, జగన్, దగ్గుబాటి కలిసి కుట్ర 
  • వైసీపీ-బీజేపీలు పాలూనీళ్లలా కలిసిపోయాయి
  • జగన్ నివాసంలో తెలంగాణ, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బు 
ఏపీ సీఎం చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్, కొత్తగా వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసి ఈ కుట్రకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ, ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బును తాడేపల్లిలోని జగన్ నూతన నివాసంలోనే దాచారని, రాబోయే ఎన్నికల్లో ఒక్కో ఓటుకు పది వేల రూపాయల చొప్పున ఇచ్చిన కొనుగోలు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. వైసీపీ-బీజేపీలు పాలూనీళ్లలా కలిసిపోయాయని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
mlc
buddha

More Telugu News