Andhra Pradesh: ఏపీకి రైల్వోజోన్ ఇస్తామని చెప్పి ఒక ‘మాయ జోన్’ ఇచ్చారు: కేంద్రంపై చంద్రబాబు ఫైర్

  • చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ ని ఒడిశాకు ఇచ్చారు  
  • మనల్ని మోసం చేస్తున్నారు
  • ప్రయాణికులపై వచ్చే ఆదాయమే మనకొస్తుంది
ఏపీకి రైల్వోజోన్ ఇస్తామని చెప్పి ఒక ‘మాయ జోన్’ ని ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సును ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి రైల్వేజోన్ కావాలన్నది ఇక్కడి ప్రజల కల, అయితే, వాల్తేరుతో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలన్నది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ అని, ఆ కల నెరవేరలేదని అన్నారు. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ ని పక్క రాష్ట్రానికి ఇచ్చి, మనల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదాయం పక్క రాష్ట్రమైన ఒడిశాకు పోతుందని, ప్రయాణికులపై వచ్చే ఆదాయమే మనకు వచ్చేలా చేశారని చంద్రబాబు విమర్శించారు.
Andhra Pradesh
Vizag
cm
Chandrababu
Telugudesam

More Telugu News