Andhra Pradesh: భయపడే ప్రసక్తే లేదు..న్యాయం జరిగే వరకు వదలం: ఏపీ సీఎం చంద్రబాబు

  •  తెలంగాణలో కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నారు
  • టీడీపీకి వ్యతిరేకంగా ఉండాలని వారిని బెదిరిస్తున్నారు
  • మన హక్కుల కోసం పోరాటం ఆపం
తెలంగాణలో ఎవరైతే కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నారో, వారిని బెదిరించి టీడీపీకి వ్యతిరేకంగా ఉండమంటున్నారని, అలా చేయని వారికి నోటీసులు ఇస్తున్నారని, వారిని వేధింపుల పాలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సును ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఇలాంటి విషయాలన్నింటిపైనా మనం ఆలోచించుకోవాలని సూచించారు. విభజన హామీలు నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతుంటే మనలను ఇబ్బందుల పాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అన్నిశాఖల అధికారులతో దాడులు చేయిస్తున్నారని, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని, అయినా, భయపడే ప్రసక్తే లేదని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. మన హక్కుల కోసం పోరాడి, న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టమని కేంద్రాన్ని మరోసారి హెచ్చరించారు.
Andhra Pradesh
Vijayawada
Telugudesam
Chandrababu

More Telugu News