Andhra Pradesh: ఏపీ మంత్రి లోకేశ్ ఎందుకూ పనికిరాని గన్నేరు పప్పు!: వైసీపీ నేత ఆర్కే రోజా సెటైర్

  • చంద్రబాబు పాలనలో రక్షణ లేకుండా పోయింది
  • పసుపు-కుంకుమ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారు
  • జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ
చంద్రబాబు పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్న జగన్.. నవరత్నాలను రూపొందించారన్నారు. జగన్ సీఎం అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు వీధివీధికో బార్, గ్రామాల్లో విచ్చలవిడిగా వైన్ షాపులకు అనుమతి ఇచ్చారని రోజా దుయ్యబట్టారు. ఏకంగా మహిళా అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే దాడిచేసినా చంద్రబాబు పట్టించుకోలేదనీ.. అలాంటి వ్యక్తిని అన్నా అని కాకుండా సున్నా అని పిలవాలని ఎద్దేవా చేశారు. జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటే, చంద్రబాబు ఇంతవరకూ కనీసం ఎన్టీఆర్ భవన్ ను కూడా రాజధానిలో ఏర్పాటు చేయలేదన్నారు.

జగన్ అమరావతిలో అడుగుపెట్టగానే రైల్వే జోన్ వచ్చిందనీ, ఇప్పుడు ఏపీ నుంచి చంద్రబాబును వెళ్లగొడితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎందుకూ పనికిరాని గన్నేరు పప్పు అని సెటైర్ వేశారు. మహిళలకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్‌ డేటెడ్‌ చంద్రబాబుదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
YSRCP
roja
jagan

More Telugu News