pakistan: మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాక్ యుద్ధ విమానాలు

  • కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్
  • పూంచ్ సెక్టార్ లో భారత గగనతలంలోకి వచ్చిన పాక్ విమానాలు
  • మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాక్
పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ మధ్యాహ్నం మరోసారి ఎల్వోసీని దాటి భారత గగనతలంలోకి పాకిస్థాన్ కు చెందిన రెండు యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో భారత గగనతలంలోకి జొరబడ్డాయి. అయితే, పాక్ యుద్ధ విమానాలను మన ఎయిర్ ఫోర్స్ ఫైటర్లు ప్రతిఘటించారు. వాటిని వెంబడించి, వెనక్కి మళ్లేలా చేశారు.

ఈ ఉదయం పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కాల్పులకు తెగబడింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూడా ఇండియన్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఇదే సమయంలో పాక్ విమానాలు మన గగనతలంలోకి చొచ్చుకువచ్చాయి.
pakistan
jets
india
air space

More Telugu News