Uttar Pradesh: పాక్‌కు చిక్కిన పైలెట్‌ అభినందన్‌ విషయంలో ప్రధాని మౌనం దారుణం: అఖిలేష్‌

  • మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి
  • దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా పట్టదా అని ట్వీట్‌
  • ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్న
మన వాయుసేన వింగ్‌ కమాండర్‌ని పాకిస్థాన్‌ సైన్యం అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతుండడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరు మెదపడం లేదని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ విమర్శించారు. మన పైలెట్‌ను పాక్‌ అదుపులోకి తీసుకుని అప్పుడే ఒక రోజు గడిచిపోయిందని, అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని దేశం కోరుకుంటోందని అన్నారు. కానీ దేశాన్ని నడిపిస్తున్న మన నాయకుడు మాత్రం అభినందన్‌ విషయంలో ఏం చేస్తున్నారు, పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయంలో మౌనంగానే ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు.
Uttar Pradesh
akhilesh yadav
pailot abhinanandan
Narendra Modi

More Telugu News