national herald: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యాలయాన్ని ఖాళీచేయండి: ఏజేఎల్‌కు హైకోర్టు ఆదేశం

  • నేషనల్‌ హెరాల్డ్‌ దినపత్రిక లీజుకు తీసుకున్న భవనం ఇది
  • కేంద్ర ప్రభుత్వం లీజు రద్దుచేయగా స్టే విధించిన ఢిల్లీ  హైకోర్టు
  • తాజాగా స్టేను వెనక్కి తీసుకున్న కోర్టు
నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యాలయం ఖాళీ చేసే అంశంపై  యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని కాంగ్రెస్‌ సారధ్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ దినపత్రిక 56 ఏళ్ల లీజుకు తీసుకుంది. అయితే లీజు రద్దుచేస్తూ ఈ భవనాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 30న ఆదేశాలు జారీచేసింది. దీంతో నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు కేంద్రం ఆదేశాలపై స్టే విధించింది. దీనిపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా పరిశీలించిన కోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది.
national herald
AJL
delhi court

More Telugu News