indian navy: హై అలర్ట్ ప్రకటించిన ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్

  • మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ లైన్ పరిధిలో హై అలర్ట్
  • సముద్ర జలాల్లో పెట్రోలింగ్ తీవ్రతరం
  • పెట్రోలింగ్ బలగాల సంఖ్య పెంపు
భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్ లైన్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నేవీ, కోస్ట్ గార్డ్స్ లు సముద్రంలో తమ పెట్రోలింగ్ ను తీవ్రతరం చేశాయి. పెట్రోలింగ్ బలగాల సంఖ్యను కూడా పెంచాయి. ఇదే సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఆయుధాలతో కూడిన పాకిస్థాన్ సబ్ మెరైన్లు భారత ప్రాదేశిక జలాల్లో నుంచే దాడి చేసే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ ఏజెన్సీలు నేవీ, కోస్ట్ గార్డ్స్ ను హెచ్చరించాయి.
indian navy
coat gaurds
security agencies
high alert

More Telugu News