TRS: టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి సమావేశాలను వాయిదా వేసుకుంటున్నాం!: కేటీఆర్

  • భారత్-పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో నిర్ణయం
  • వచ్చే నెల 1 నుంచి 12 వరకూ జరగాల్సిన భేటీ వాయిదా
  • తదుపరి సమావేశాలపై కేసీఆర్ తో చర్చించాక ప్రకటన
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1 నుంచి 12 వరకూ జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నారు.

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై కేసీఆర్ తో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
TRS
Telangana
KCR
KTR
parluiamentary meeting
suspended

More Telugu News