Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ డిస్ట్రిబ్యూషన్ హక్కులపై వదంతులు.. క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

  • ఎవరెవరో కొన్నారంటూ ప్రచారం 
  • సోషల్ మీడియాలో ఖండించిన దర్శకుడు వర్మ
  • ఫైనల్ వివరాలు త్వరలోనే అప్ డేట్ చేస్తామని వ్యాఖ్య
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హక్కులను ఎవరెవరో ఏదో రేటుకి కొన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వర్మ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి గమనిక. లక్ష్మీస్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి  కొనుక్కున్నారు అని వస్తున్న రకరకాల వార్తల్లో నిజం లేదు. ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జీవీ ఫిల్మ్స్, ఆర్జీవీ  మరియు రాకేశ్ రెడ్డిలు త్వరలో అప్ డేట్ చేస్తారు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telangana
ntr
Telugudesam
Tollywood
distribution rights
Twitter
ramgopal varma

More Telugu News