India: ఆ నిజం తెలుసుకోవడానికి ఇంకెంత రక్తం చిందాలి?: పాక్ మాజీ కెప్టెన్ అక్రం

  • పాకిస్థాన్ మీ శత్రువు కాదు
  • ఇద్దరం ఒకే శత్రువుపై పోరాడుతున్నాం
  • ఉగ్రవాద పీచమణచేందుకు ఇరు దేశాలు చేతులు కలపాలి
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రం స్పందిస్తూ భారత్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. నిజానికి భారత్ శత్రువు పాకిస్థాన్ కాదని, రెండు దేశాలు ఒకే శత్రువుపై పోరాడుతున్నాయని పేర్కొన్నాడు. ‘‘బరువెక్కిన నా హృదయంతో మీకు (భారత్‌కు) విజ్ఞప్తి చేస్తున్నా. పాకిస్థాన్ మీ శత్రువు కాదు. మీ శత్రువే మా శత్రువు కూడా. ఒకే శత్రువుపై ఇద్దరం పోరాడుతున్న విషయం తెలుసుకోవడానికి ఇంకెంత రక్తం చిందాలి? ఇద్దరి ఉమ్మడి శత్రువు అయిన ఉగ్రవాదంపై పోరాడాలంటే మనిద్దరం చేతులు కలపాలి’’ అని అక్రం ట్వీట్ చేశాడు.
India
Pakistan
Air strikes
Surgical strikes
Pulwama attack
Wasim Akram

More Telugu News