Pakistan: సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగి భారత్ పెద్ద తప్పు చేసింది.. పాక్‌ను రెచ్చగొట్టొద్దు: పాక్ సినీ నటి మహీరా ఖాన్

  • మీడియా రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దు
  • ఇలాంటి చర్యలు హేయమైనవి 
  • మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి
పాక్‌ను రెచ్చగొట్టొద్దని హీరోయిన్ మహీరాఖాన్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్‌పై స్పందించిన మహీరా రెండు వరుస ట్వీట్లు చేసింది. సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగి భారత్ పెద్ద తప్పు చేసిందని.. పాక్‌ని రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వొద్దని హెచ్చరించింది. ఇలాంటి చర్యలు హేయమైనవని.. మళ్లీ ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు రావాలంటూ ఆకాంక్షించింది. మహీరా పనిలో పనిగా మీడియాకు కూడా హితబోధ చేసింది.

మనషులుగా మనం పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. ఇలాంటి సమయంలో మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. ఇది శాంతిని బోధించాల్సిన సమయమని.. మీడియా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని సూచించింది. ఎల్లప్పుడూ శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నానంటూ మహీరా ట్వీట్ చేసింది. మహీరాఖాన్ పాకిస్థాన్‌కి చెందిన ప్రముఖ నటి. 'హమ్ సఫర్' చిత్రం ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. 2017లో షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘రయీస్’ సినిమాలోనూ హీరోయిన్‌గా అలరించింది.
Pakistan
India
surgical strike
Fathima Bhutto
Media
Mahira Khan

More Telugu News