సర్జికల్ స్ట్రయిక్స్ ఎఫెక్ట్ : ఆర్థిక రాజధాని ముంబయిలో భద్రత కట్టుదిట్టం
- విమానాశ్రయం, రైల్వేస్టేషన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో సీసీ టీవీలతో నిఘా పెంపు
- పాఠశాలలు, కంపెనీలకు మార్గదర్శకాలు జారీ
- త్రివిధ దళాధిపతులతో సమావేశం కానున్న రక్షణ మంత్రి
ప్రజలు ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానితులు కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ త్రివిధ దళాధిపతులతో ఈరోజు సమావేశం అవుతున్నారు. వారు తీసుకువచ్చిన ప్రతిపాదనలపై ఆమె చర్చించనున్నారు.