Vizag: వైజాగ్ టీడీపీ కార్యాలయంకు కరెంట్ కనెక్షన్ ను కట్ చేసిన విద్యుత్ శాఖ!

  • రూ. 4.80 లక్షలకు పెరిగిన బిల్లు బకాయి
  • ఫ్యూజ్ లు పీకేసిన అధికారులు
  • బకాయిలు కడితేనే పునరుద్ధరణని స్పష్టం
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ నేతలకు విద్యుత్‌ శాఖ అధికారులు షాకిచ్చారు. కార్యాలయంలో విద్యుత్ బిల్లు బకాయిలు భారీగా పేరుకున్న నేపథ్యంలో కరెంట్ ను కట్ చేశారు. కార్యాలయానికి వచ్చిన అధికారులు, ఫ్యూజ్ లు తొలగించి, వాటిని తీసుకుని వెళ్లిపోయారు. బకాయి పడ్డ రూ. 4.8 లక్షలను వెంటనే చెల్లిస్తేనే తిరిగి కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాగా, పార్టీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మరణించకముందు కార్యాలయ వ్యవహారాలన్నీ ఆయనే నిర్వహించేవారు. అప్పట్లో నెలకు దాదాపు రూ. 80 వేల వరకూ కరెంట్ బిల్ వస్తుండేది. ఆ డబ్బును ఆయనే చెల్లించారు. మూర్తి మరణించిన తరువాత ఎవరూ కరెంట్ బిల్ కట్టేందుకు ఆసక్తిని చూపకపోవడంతోనే బిల్లు బకాయి పెరిగిపోయిందని తెలుస్తోంది.
Vizag
Telugudesam
Power Cut
Connection

More Telugu News