Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో కారును ఢీకొట్టిన లారీ... ముగ్గురి దుర్మరణం

  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  • ఈరోజు తెల్లవారు జామున దుర్ఘటన
  • రంగారెడ్డి జిల్లా దెబ్బెడగూడ గేట్‌ సమీపంలో ఘటన
తెల్లవారు జామునే వారి జీవితాలు తెల్లారిపోయాయి. లారీ రూపంలో మృత్యువు కబళించింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దెబ్బెడగూడ గేట్‌ సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలపాయ్యారు.

పోలీసుల కథనం మేరకు...వేగంగా వస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు ముందుభాగం లారీ కిందికి దూసుకు పోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు అందులో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అప్పటికే మృతి చెందగా తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఎవరు, ఎక్కడివారన్నది తెలియరాలేదు.
Ranga Reddy District
Road Accident
three died

More Telugu News