Rastrapathi Bhavan: నా కారణంగా కార్యక్రమం ఆలస్యమైంది.. క్షమించండి: మోదీ

  • బహుమతుల ప్రదానోత్సవానికి లేటైన మోదీ
  • కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత
  • వేరే పని వల్ల లేటయిందని చెప్పిన మోదీ
రాష్ట్రపతి భవన్‌లో నేడు గాంధీ శాంతి బహుమతుల బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన ప్రధాని మోదీ క్షమాపణలు కోరారు. వేరే పని కారణంగా తాను కార్యక్రమానికి ఆలస్యంగా రావాల్సి వచ్చిందని.. తన వల్లే కార్యక్రమం ఆలస్యమైందని పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌కు వెళ్లడానికి ముందు మోదీ ఉదయం 10 గంటల సమయంలో తన అధికారిక భవనంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. దీని కారణంగా ఉదయం 11 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో వేరే పని వల్ల సమయానికి రాలేకపోయానని.. తన కారణంగా కార్యక్రమం ఆలస్యమైనందుకు క్షమాపణ కోరారు.
Rastrapathi Bhavan
Narendra Modi
Cabinet Committee on Security
Award Presentation

More Telugu News