Pakistan: పాక్ పార్లమెంటును కుదిపేసిన భారత దాడులు!

  • ‘ఇమ్రాన్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు
  • సమయం చూసుకుని బదులిస్తామన్న ఇమ్రాన్
  • పాక్ పార్లమెంటులో వాడీవేడి వాదనలు
ఇటీవలే పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్ర‌దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర‌శిబిరాల‌ను భార‌త వైమానిక దళం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సరైన సమయం చూసుకుని బదులిస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రకటించారు. మరోపక్క, భారత వైమానిక దళం పాకిస్థాన్‌లో ఉగ్ర స్థావరాలపై చేసిన వైమానిక దాడులు.. ఈ రోజు పాక్ పార్లమెంటును కుదిపేశాయి.

ప్రతిపక్షాలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) మంత్రులు భారత్ చేపట్టిన మెరుపు దాడుల గురించి మాట్లాడుతుండగా ప్రతిపక్ష పార్టీలు ‘ఇమ్రాన్ ఖాన్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.
Pakistan
Parliament
Imran Khan
Pulwama
India
Pakistan Tehrik Inhaf

More Telugu News