India: భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ స్పందించిన సచిన్

  • తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన భారత్
  • తెల్లవారుజామున 3:30 గంటలకు దాడి
  • మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దన్న సచిన్
పుల్వామా దాడికి నేడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టింది. నేటి తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలు పెట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్‌ను కేవలం 20 నిమిషాల్లో ముగించింది. పాక్ తేరుకునే సరికి బాంబుల వర్షం కురిపించింది.

భారత వైమానిక దళాలు జరిపిన ఈ సాహసోపేత దాడిపై ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత వాయుసేనకు సెల్యూట్ చెప్పారు. ‘మా మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు. భారత వాయుసేనకు నా సెల్యూట్. జైహింద్’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
India
Pakistan
POK
Balakot
Sachin Tendulkar
Salute

More Telugu News