Jammu And Kashmir: పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారు.. ఆర్మీ ట్వీట్... వైరల్!

  • కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి
  • రామ్ ధారీ సింగ్ రచించిన పద్యాన్ని పోస్ట్ చేసిన ఆర్మీ
  • చేతగాని వారని భావిస్తే నష్టమని వ్యాఖ్య
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి వచ్చిన తరువాత, భారత ఆర్మీ ఓ హిందీ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ, ట్వీట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. భారత సైన్యం ప్రజా సంబంధాల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్, తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ దినకర్ రచించిన పద్యాన్ని ఉంచారు.

కౌరవ, పాండవులను పోల్చుతూ సాగిన ఈ ట్వీట్ లో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదన్న అర్థం వచ్చేలా ఈ పద్యం సాగుతుంది. యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారని గుర్తు చేస్తుంది.



Jammu And Kashmir
Army
Twitter
Surgicle Strikes

More Telugu News