Virendra Sehwag: 'ఆట అదిరింది గురూ'..: వీరేంద్ర సెహ్వాగ్

  • ట్విట్టర్లో స్పందించిన సెహ్వాగ్
  • 'సుధార్ జావో వర్మా సుధార్ దేంగే' అని హ్యాష్ ట్యాగ్
  • సర్జికల్ స్ట్రయిక్స్ పై అభినందనలు
భారత వాయుసేన దళాలు జరిపిన లక్షిత దాడులపై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఆట అదిరిందన్నాడు. "మన కుర్రాళ్లు చాలా చక్కగా ఆడారు" అంటూ క్రికెట్ భాషలో ట్వీట్ చేస్తూ, 'సుధార్ జావో వర్మా సుధార్ దేంగే' అని హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే సెహ్వాగ్, తనదైన చతురతతో పలు ట్వీట్లు చేస్తూ, ఆటకు దూరమైనా, అభిమానులకు దగ్గరగా ఉంటుంటాడన్న సంగతి తెలిసిందే.



Virendra Sehwag
Surgicle Strikes
Twitter

More Telugu News