Andhra Pradesh: టీడీపీ ఎంపీ తోటను కలిసిన వైసీపీ నేత బొత్స

  • కిర్లంపూడి మండలంలోని వీరవరంలో ఇద్దరూ భేటీ
  • దాదాపు అరగంట పాటు చర్చలు  
  • రాజకీయంగా చర్చనీయాంశమైన భేటీ
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడకు చెందిన టీడీపీ నేత, ఎంపీ తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు. తోట స్వగ్రామం కిర్లంపూడి మండలంలోని వీరవరంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. భేటీ అనంతరం, బొత్స అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తోటను బొత్స కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Andhra Pradesh
kakinada
mp
Telugudesam
YSRCP
botsa
satyanarayana
kirlampudi
veeravaram

More Telugu News