Narendra Modi: పుల్వామా దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారు మిస్టర్ మోదీ?: నిప్పులుచెరిగిన దీదీ

షార్ట్స్‌లో చూడండి
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారు మిస్టర్ మోదీ? అంటూ ఆవేశం ప్రదర్శించారు. "ఉగ్రదాడి జరుగుతుందని మీకు ముందే తెలుసు, ప్రభుత్వం వద్ద నిఘా వర్గాల నివేదికలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జవాన్లను వాయుమార్గం ద్వారా ఎందుకు తరలించలేదు? రహదారులపై ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు? రోడ్ల భద్రతను ఎందుకు విస్మరించారు? అన్నీ తెలిసి సీఆర్పీఎఫ్ జవాన్లను ఎందుకు మృత్యుకుహరంలోకి నెట్టారు? ఇప్పుడొచ్చి ఎన్నికల కోసం శవరాజకీయాలు చేస్తారా?" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దీదీ.

జవాన్ల వీరమరణం విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతిసారి ప్రజలను వెర్రివాళ్లను చేయడం సాధ్యం కాదని ప్రధానికి ఆమె చురకలంటించారు. సోమవారం కోల్ కతాలోని నజ్రుల్ మంచ్ వద్ద తృణమూల్ కాంగ్రెస్ విస్తృత కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Narendra Modi

More Telugu News