Andhra Pradesh: చంద్రబాబు మమ్నల్ని తిడుతూనే మా పథకాలు కాపీ కొడుతున్నారు!: కేటీఆర్ విమర్శలు

  • ఏపీలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలి
  • బాబు పోతేనే జాబు వస్తుందని ప్రజలకు అర్థమైంది
  • నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వారి మధ్య ఉంది 
సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని, బాబు పోతేనే జాబు వస్తుందన్న విషయం వారికి అర్థమైందని వ్యాఖ్యానించారు. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా చంద్రబాబు బతకలేరని విమర్శించారు.

చంద్రబాబుకు, కేసీఆర్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను తిడుతున్న చంద్రబాబు, తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబులాగా కుట్రలు, కుతంత్రాలు తమకు చేతకావని, ఇటీవల జరిగిన ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చిన చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పి పంపించామని అన్నారు.  
Andhra Pradesh
Chandrababu
Telangana
KTR

More Telugu News