Rahul Gandhi: పాము-ముంగిసలా చంద్రబాబు-రాహుల్ ఒక్కటయ్యారు: కేటీఆర్

  • తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో హడావిడి చేశారు
  • 16 ఎంపీ సీట్లలోనూ టీఆర్ఎస్ ను గెలిపించాలి
  • ఢిల్లీని గడగడలాడించి.. అడిగింది ఇచ్చేలా చేస్తాం
పాము-ముంగిసలా చంద్రబాబు-రాహుల్ ఒక్కటయ్యారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో హడావిడి చేశారని, అయినప్పటికీ టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, కాంగ్రెస్ నేతలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని, రేపు 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే, ఢిల్లీని గడగడలాడించి మనం అడిగింది ఇచ్చేట్లు కేసీఆర్ చేస్తారని అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ, మోదీల పైనా ఆయన విరుచుకుపడ్డారు. ఈ ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదని, కేవలం బిల్డప్ ఇచ్చారని అన్నారు. మోదీ, రాహుల్ పై జనం అంత సంతృప్తిగా లేరని, ఇలాంటి తరుణంలో ఒక్క ఎంపీ సీటు కూడా కీలకమేనని, ఢిల్లీని ప్రశ్నించే సత్తా బీజేపీ, కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు.
Rahul Gandhi
Chandrababu
Telugudesam
Congress
KTR

More Telugu News