Vijayawada: ఫత్వా జారీ చేసినా నా కూతురు పోటీ చేస్తుంది: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

  • నాడు మల్లికా బేగం తనపై ఫత్వాను గౌరవించలేదు
  • అటువంటి ఆమె నా కూతురిని ప్రశ్నించేది
  • 2009 నాటి పరిస్థితులకు, ఇప్పటికి చాలా తేడా ఉంది
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానాకు మతపెద్దలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై, జలీల్ ఖాన్ స్పందిస్తూ, నాడు తనకు జారీ అయిన ఫత్వాను మల్లికా బేగం గౌరవించలేదని అన్నారు.

అటువంటి ఆమె తన కూతురు పోటీ విషయమై ప్రశ్నిస్తోందని విమర్శించారు. 2009 నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని, సౌదీ లాంటి దేశాల్లోనే ఎన్నో మార్పులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫత్వా జారీ చేసినా కూడా తన కూతురు పోటీ చేస్తుందని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.
Vijayawada
wes mla
jalil khan
shabana
fatwa

More Telugu News