Prakasam District: ఒంగోలులో వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఘర్షణ.. రాళ్లు రువ్వుకుని, చెప్పులతో పరస్పర దాడులు!

  • కమ్మపాలెంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై ఘర్షణ
  • వైసీపీ ఫ్లెక్సీలను చింపివేసిన టీడీపీ కార్యకర్తలు
  • పోలీసులు లాఠీఛార్జి
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకుని, చెప్పులతో దాడికి దిగారు. పట్టణంలోని కమ్మపాలెం ప్రాంతంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. అక్కడ ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, పోలీసులు జోక్యం చేసుకుని వారిపై లాఠీఛార్జీ చేసినట్టు తెలుస్తోంది.

కాగా, కమ్మపాలెంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని, ఆ కాలనీ ప్రవేశ ద్వారం వద్ద వారు బైఠాయించినట్టు తెలుస్తోంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిని  అడ్డుకున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Prakasam District
ongole
YSRCP
Telugudesam

More Telugu News